బట్టమేక పిట్ట కర్నూలు జిల్లాలోని రోళ్ళపాడు అభయారణ్యంలో కలదు. ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న అరుదైన బట్టమేక పక్షిని నందికొట్కూరు నియోజకవర్గంలోని రోళ్లపాడు గ్రామంలో కలదు. రకం పక్షులు ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 150 మాత్రమే ఉన్నాయి. గతంలో ఈ సంఖ్యగా అధికంగా వుండేదని, అయితే వేటగాళ్ల ఉచ్చులకు బలై వాటిసంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. 1979లో బాంబేరిసెర్చ్ వారు పరిశోధించి బట్టమేక పక్షి ప్రాధాన్యతను గుర్తించారు. ప్రముఖ పక్షి శాస్తవ్రేత్త, నోబుల్ అవార్డు గ్రహిత సలీంఅలీ 1980లో రోళ్లపాడు వద్ద బట్టమేక పక్షిని సంరక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. 1988లో ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటించి 600 హెక్టారుల భూమిని దీని కొరకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అలగనూరు గ్రామంవద్ద ఉన్న సుంకేసుల సమీపంలో 800 ఎకరాల భూమిని కేటాయించి వాటి సంరక్షణకు సిబ్బందిని నియమించారు. బట్టమేక పక్షి ఒక మీటరు పొడవు, సుమారు 15 నుండి 20 కిలోల బరువుతో ఉండి, పొడవాటి మెడకలిగి వుంటుంది. వీటిసంతతి చాలా అరుదుగా వృద్ధిచెందుతూ కేవలం ఏడాదికి ఒక గుడ్డు మాత్రమేపెట్టి దట్టమైన పొదల్లో 27 రోజుల గుడ్డును పొదుగు తుంది. బట్టమేక పక్షలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా వుంటు పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలను భుజిస్తూ, పంటలను సంరక్షిస్తుంటాయి.
Illustration by Henrik Grönvold from E. C. Stuart Baker's Game-birds of India, Burma
From Thomas Hardwicke's Illustrations of Indian Zoology (1830–1835)
Eggs of the species in comparison to the smaller ones of the lesser florican