dcsimg
甘藍的圖片
Life » » Archaeplastida » » 木蘭綱 » » 十字花科 »

甘藍

Brassica oleracea var. capitata L.

కాబేజీ ( 泰盧固語 )

由wikipedia emerging languages提供

కాబేజీ (Cabbage) మధ్యధరా సముద్ర ప్రాంతములో కనిపించే ఆకులు మెండుగా ఉన్న అడవి ఆవాల మొక్క నుండి 100 వ సంవత్సరము ప్రాంతములో ఉద్భవించింది. కాబేజీ అన్న పదము నార్మన్-పికార్డ్ పదము కబోచే ("తల") నుండి వచ్చింది.

 src=
క్యాబేజి. (పాకల సంతలో)

క్యాబేజీ ఒక ఆకుకూర

ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు. కాబేజీ పైన ఉన్న తొక్కలు గట్టిగా అంటుకొని ఆకులు పచ్చగా ఉండవలె, పగుళ్ళు ఉన్న క్యాబేజీ త్వరగా చెడిపోతుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది. రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది . శరీరములో కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది . రక్తములో చెక్కెర స్థాయిని అదుపు చేసేందుకు గ్లూకోజ్ టోలరెన్స్ (glucose tolarence) లో భాగమైన ' క్రోమియం ' ఈ లెట్యూస్ లో పుష్కలముగా ఉంటుంది . నిద్ర పట్టేందుకు దోహదం చేసే " లాక్ట్యుకారియం (Lactucarium)" అనే పదార్ధము ఇందులో ఉంటుంది .

పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు

శక్తి 20 kcal 100 kJ పిండిపదార్థాలు 5.8 g చక్కెరలు 3.2 g పీచుపదార్థాలు 2.5 g కొవ్వు పదార్థాలు 0.1 g మాంసకృత్తులు 1.28 g థయామిన్ (విట. బి1) 0.061 mg 5% రైబోఫ్లేవిన్ (విట. బి2) 0.040 mg 3% నియాసిన్ (విట. బి3) 0.234 mg 2% పాంటోథీనిక్ ఆమ్లం (B5) 0.212 mg 4% విటమిన్ బి6 0.124 mg 10% ఫోలేట్ (Vit. B9) 53 μg 13% విటమిన్ సి 36.6 mg 61% కాల్షియమ్ 40 mg 4% ఇనుము 0.47 mg 4% మెగ్నీషియమ్ 12 mg 3% భాస్వరం 26 mg 4% పొటాషియం 170 mg 4% జింకు 0.18 mg 2%

ఔషధ గుణాలు

కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదనీ ముఖ్యంగా క్యాన్సర్‌ను నిరోధించటంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన "ప్లేవనాయిడ్స్" సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా "పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్" ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ రావటం అరుదుగా సంభవిస్తుందనీ, అయితే క్యాబేజీతో దానికి చెక్ పెట్టవచ్చు క్యాబేజీని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు. అంతేగాకుండా.. పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీని తిన్నట్లయితే పాలు బాగా పడతాయి. క్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు మటుమాయమవుతుంది. క్యాబేజీ ఆకుల రసాన్ని అలాగే తాగలేనివారు కాస్త పంచదార కలుపుకుంటే సరి. అదే విధంగా అతిగా పొగతాగే పొగరాయుళ్లను ఆ అలవాటునుంచి మాన్పించేందుకు నానా కష్టాలు పడేవారికి క్యాబేజీ సాయపడుతుంది. అయితే వారిని పూర్తిగా పొగతాగటం మాన్పించటం కాదుగానీ.. పొగ తాగినప్పుడు శరీరానికి కలిగే దుష్ఫలితాల తీవ్రతను తగ్గించుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా క్యాబేజీ తినాల్సిందే.

ఇతర ఉపయోగాలు

 src=
క్యాబేజీ పోపు కూర
దస్త్రం:క్యాబేజీ, పెసరపప్పు కూర (2).jpg
క్యాబేజీ, పెసరపప్పు కూర
 src=
క్యాబేజీ

క్యాబేజీ ఒక ఆకుకూర. ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు.

పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు. కాబేజీ పైన ఉన్న తొక్కలు గట్టిగా అంటుకొని ఆకులు పచ్చగా ఉండవలె, పగుళ్ళు ఉన్న క్యాబేజీ త్వరగా చెడిపోతుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది.

మూలాలు

許可
cc-by-sa-3.0
版權
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు
原始內容
參訪來源
合作夥伴網站
wikipedia emerging languages