dcsimg

ఆస్టరేసి ( Telugu )

provided by wikipedia emerging languages

ఆస్టరేసి (Asteraceae) కుటుంబం ద్విదళబీజాలలో అన్నింటికంటే ఎక్కువ పరిణతి చెందినదిగా పరిగణిస్తారు. పూర్వం దీనిని కంపోజిటె అని పిలిచేవారు. ఆవృతబీజాలలో ఆస్టరేసి అతిపెద్ద కుటుంబం. దీనిలో సుమారు 950 ప్రజాతులు, 20,000 జాతులు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి.

కుటుంబ లక్షణాలు

  • మొక్కలు ఎక్కువగా ఏకవర్షిక గుల్మాలు, కొన్ని ఎగబాకే తీగలు.
  • సరళ పత్రాలు, పుచ్ఛరహితము, ఏకాంతర లేదా అభిముఖ పత్ర విన్యాసము.
  • శీర్షవత్ లేదా సంయుక్త శీర్షవత్ పుష్ప విన్యాసము.
  • అండకోశోపరిక, సౌష్టవయుత లేదా పాక్షిక సౌష్టవయుత పుష్పకాలు.
  • రక్షక పత్రాలు క్షీణించి కేశగుచ్ఛంగా మారుట.
  • పరాగకోశ సంయుక్త కేసరాలు 5, మకుట దళోపరిస్థితము.
  • నిమ్న అండాశయము, ద్విఫలయుత సంయుక్తము, ఏకబిలయుతము.
  • పీఠ అండము.
  • సిప్పెలా ఫలము.

ముఖ్యమైన మొక్కలు

మూలాలు

  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు