శంఖపుష్పం (Clitoria ternatea; సంస్కృతం: श्वेतां, विष्णूक्रांता) పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ఎగబ్రాకే మొక్క. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు.[1] విష్ణుక్రాంత పత్రి విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదవది.
ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సమంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.
ఈ ఎగబ్రాకే మొక్క పుష్పాలు మానవ స్త్రీల యోని (Vulva) ఆకారంలో ఉండడం వలన లాటిన్ భాషలో దీని ప్రజాతి పేరు "క్లిటోరియా (Clitoria)" క్లిటోరిస్ "(Clitoris)". (Synonyms: Clitoris principissae.) నుండి ఉత్పన్నమైనది.[2] టెర్నేటియా ("Ternatea") ఇండోనేషియా దేశంలో ఒక ప్రాంతం పేరు టెర్నేట్ (Ternate) నుండి వచ్చింది. తమిళం, తెలుగు, మళయాళం భాషలలో దీని పేరు శంఖం (Seashell) నుండి వచ్చింది.
శంఖపుష్పం (Clitoria ternatea; సంస్కృతం: श्वेतां, विष्णूक्रांता) పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ఎగబ్రాకే మొక్క. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు. విష్ణుక్రాంత పత్రి విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదవది.
ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సమంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.
Side view of the flower at Kolkata, West Bengal, India Flower and pods in different states of ripeness The shape of the flower has inspired some of its names. Front and back sides