dcsimg

పేను ( 泰盧固語 )

由wikipedia emerging languages提供

పేను (బహువచనం పేలు) (ఆంగ్లం: Louse or Lice) రెక్కలు లేని రక్తాహార కీటకాలు. ఇవి ఇంచుమించు అన్ని జంతువులు, పక్షుల శరీరం మీద బాహ్య పరాన్న జీవులు.మెడికర్ అను షాంపూ పేలు నివారణకు వాడతారు.

భాషా విశేషాలు

తెలుగు భాషలో పేను కొరుకుట pēnu-korukuṭa. n. A disease arising from lice which destroy the hair అనే వ్యాధి. పేను గుడ్డు లేదా పేను పిల్లలను n. A nit. ఈరు అంటారు.[1] విశేషణంగా పేను అనగా To twist, or entwine. కలిపి పేను to twist together అని కూడా అర్ధం చెప్పవచ్చును.

మానవులలో

మానవుల తలమీద వెంట్రుకల మధ్య నివసించే పేను శాస్త్రీయ నామం 'పెడిక్యులస్ హ్యూమనస్ కాపిటిస్' (Pediculus humanus capitis). మానవుల శరీరంమీద నివసించే పేను శాస్త్రీయ నామం 'పెడిక్యులస్ హ్యూమనస్ హ్యూమనస్' (Pediculus humanus humanus). అలాగే బాహ్య జననేంద్రియాల చుట్టూ ఉండే వెంట్రుకల మధ్య నివసించే పేను శాస్త్రీయ నామం 'థైరస్ ప్యూబిస్' (Pthirus pubis). దీన్ని పీత పేను అని కూడా అంటారు. వీటన్నింటివల్ల వచ్చే వ్యాధిని 'పెడిక్యులోసిస్' అంటారు.

ఇవి పృష్టోదర తలాల్లో చదునుగా ఏర్పడి ఉంటుంది. ముఖభాగాలు గుచ్చి పీల్చేరకానికి చెందినవి. మూడు జతల కాళ్ళుంటాయి. కాళ్ళ చివర నఖాలు వంపు తిరిగి ఉంటూ తలలోని వెంట్రుకలను, తలమీది చర్మాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. స్త్రీ కీటకాలు 80-100 అండాలు విడుదల చేస్తూ వాటిని వెంట్రుకలకు గట్టిగా అంటి పెట్టుకొనేట్టు చేస్తాయి. అండాలు తెల్లగా ఉంటాయి. అండాలనుంచి నేరుగా వారం రోజుల్లో పిల్లపేలు పుడతాయి. ఇవి 3 సార్లు నిర్మోచనాలు జరుపుకొని ప్రౌఢ జీవులుగా ఏర్పడతాయి.

ఇవి దువ్వెనల ద్వారా గానీ, ఇతర వస్తువుల ద్వారా, మనం ధరించే దుస్తుల ద్వారా వ్యాపిస్తాయి.

రిలాప్సింగ్ జ్వరం, రికెట్సియాల వల్ల ఏర్పడే టైఫస్ జ్వరం వంటి వ్యాధి జనక జీవులను పేలు సంక్రమింప చేస్త్రాయి.

  1. బ్రౌన్ నిఘంటువు ప్రకారం పేను పదప్రయోగాలు.
許可
cc-by-sa-3.0
版權
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు
原始內容
參訪來源
合作夥伴網站
wikipedia emerging languages