మౌస్ డీర్ లేదా చెవ్రోటేన్ [1][2][3][4] అనునది ఒక రకమైన బుల్లి జింక. చెవ్రోటేన్ అంటే ఫ్రెంచి భాషలో చిన్న మేక అని అర్థం. ఇది గుండ్రని దేహంతో చిన్న చిన్న కాళ్లతో ఉంటుంది.
విశేషాలు
- ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.అలానే వదిలేస్తే ఇక వీటి జాడే పూర్తిగా కనుమరుగైపోతుందని శాస్త్రవేత్తలు వీటి పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు.
- హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఈ రెండు ఆడ జింకల్ని, ఒక మగ జింకను చండీగఢ్‌లోని చట్‌బిర్ జంతు ప్రదర్శనశాలకు తీసుకెళ్లారు. దక్షిణ భారతదేశ అడవుల్లాగే ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటి సంఖ్య పెంచడానికి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు కల్పించారు. ఎట్టకేలకు ఈ ఒక్కో ఆడ జింక ఒక్కో జింక కూనకు జన్మనిచ్చింది.
- ఈ జింక రాత్రుల్లో చురుగ్గా ఉంటుంది. ఇది 25 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు, మూడు కిలోల బరువుంటుంది.
- నెమరువేసుకునే జీవుల్లో పొట్టలో మూడు గదులుండే జీవి ఇదొక్కటే.
- చిన్న చిన్న బొరియల్లో జీవిస్తూ పండ్లూ ఫలాలూ తింటూ బతికేస్తుందిది.
మూలాలు
బయటి లంకెలు