dcsimg

పాముచేప ( Telugu )

provided by wikipedia emerging languages

పాముచేప ఆంగ్విలీఫార్మస్ అనే జాతికి చెందిన పొలుసుగల చేప. ఇది వేటాడి తినే గుణంగల చేప. ఆంగ్విలీఫార్మస్ జాతియందు నాలుగు ఉపజాతులు, ఇరవై కుటుంబాలు, నూటపదకొండు కులాలు, దాదాపు ఎనిమిది వందల పాముచేపల రకాలున్నాయి. ఈ పాముచేపలు తమ పుట్టినదశ నుండి యుక్తవయసుకు వచ్చే మార్గంలో చాలా మార్పుచెందుతాయి. సాధారణంగా పాముచేప అనే పదం ఐరోపా పాముచేపను సూచిస్తుంది, ఈ రకం చేపలలోకి "తిమ్మిరిచేప" (ఆంగ్లం: ఎలక్ట్రిక్ ఈల్, జన్యువు: ఎలక్ట్రోఫోరస్), "వెన్నుపాము చేప" (ఆంగ్లం: స్పైనీ ఈల్, కుటుంబం: మాస్టఖెంబెలిడే), "లోతుసముద్ర వెన్నుపాము చేప" (ఆంగ్లం: డీప్ సీ స్పైనీ ఈల్, కుటుంబం: నోటఖాంథిడే) వస్తాయి. పైన చెప్పిన చేపలు జంతుశాస్త్రపరంగా నిజమైన పాముచేపలు కాకపోయినా అవి కాలగమనంలో పాముచేపల గుణాలను సంతరించుకుని ఆ కుటుంబంలో భాగమయ్యాయి.

 src=
ఐరోపా నల్లపాము చేప పాముచేపలన్నింటిలోకి బరువైనది

వర్ణన

పాముచేపలు చూడటానికి పొడుగ్గా, పాములాగ ఉంటాయి. వీటిలో అతిచిన్నది "ఏకదవడ పాముచేప" (శాస్త్రీయ నామం: మోనోగ్నాతస్ అహ్ల్సోత్రోమి) (5 సెం.మీలు లేదా 2 అంగుళాలు) కాగా, అతిపెద్దది "మోరే పాము చేప" (13 అడుగులు లేదా 4 మీటర్లు). పాముచేపల బరువు ముప్ఫై గ్రాముల నుండి పాతిక కేజీల పై వరకు ఉంటుంది. వీటికి కటిభాగంలో (వెన్నుపూస చివరిలో) సాధాణంగా ఇతర చేపలకున్నట్లు, రెక్క ఉండదు. అలాగే, కొన్ని రకాల పాము చేపలకు రొమ్ము పైన కూడా రెక్క ఉండదు. పృష్ఠభాగపు (వీపు), గుదభాగపు రెక్కలు కలిసిపోయి "పుచ్చీయ రెక్కగా" (తోక దగ్గర రెక్క) మారిపోయాయి. చూడటానికి చేప పై-కింది భాగ పు రెక్కలు తోక వరకు కలిసిపోయి ఉంటాయి. ఈ చేపలు నీటియందు తరంగాలను సృష్టిస్తూ, ఆ తరంగాలను తమ ఒంటికి ఆనుకొని ప్రవహించే లా చేస్తూ ఈదుతాయి. దాని వలన ఇవి ముందుకు ఎంత సులువుగా ఈదగలవో, అంతే సులువుగా వెనకకు ఈదగలవు.

బహుశాతం పాముచేపలు మహాసముద్రపు లోతులేని ప్రాంతాలలో (తీరానికి దగ్గరగా) నివసిస్తూ అక్కడి మట్టి, బురద లేదా రాళ్లలో గూళ్లుకట్టుకొంటాయి. విచిత్రమేమిటంటే ఎక్కువశాతం పాముచేపలు రాత్రివేటాడి తింటాయి. అప్పుడప్పుడు ఇవి కలిసి బ్రతుకుతాయి. వీటి గూళ్లను "పాముచేప గుంటలు" అంటారు. కొన్ని రకాల పాముచేపలు మహాసముద్రపు లోతు నీటి యందు (నాలుగు కిలోమీటర్లు లేదా పదమూడు వేల అడుగులు), ఖాండాంతరపు ఇసుకమేట వాలులలో కూడా అంతే లోతులలో నివసిస్తూంటాయి. కేవలం ఆంగ్వీల్లా కుటుంబానికి చెందినవి మాత్రమే స్వచ్ఛజలాలలోకి ఒక్కొక్క కాలంలో వచ్చి తిరి గి సముద్రానికి వెళ్లి పోతాయని తెలిసింది. బరువైన (నిజమైన కుటుంబానికి చెందిన) పాముచేప ఐరోపా నల్లపాముచేప. ఈ రకపు పాముచేపల పొడవు పది అడుగు లుంటుంది, వీటి బరువు వందకేజీల పైనుంటుంది. ఇతర పాముచేపలు పెద్దవి ఉన్నాయి కాని దీనంత బరువుగలవి కావు. ఉదాహరణకు మోరే పాముచేప నాలుగడుగులున్నా ఐరోపా నల్లపాముచేపకన్నా బరువు తక్కువ కలదే.

జీవిత చక్రం

పాముచేపలు తమ జీవితాలను చిన్న చిన్న తోకకప్పల వంటి రూపాలతో ప్రారంభిస్తాయి. వాటిని అప్పుడు "లెప్టో సెఫలీ " (అర్థము: చిన్న తల) అంటారు. పాముచేప పిల్లలు నీటి ఉపరితలానికి దగ్గరగానే ఉంటూ నీటి నాచు, ఇతర చిన్నచిన్న చనిపోయిన చేపల తేలుతున్న ముక్కలను తింటూ పెరుగుతాయి. కొంతకాలానికి ఇవి గాజుపాము చేపలుగా మారి పారదర్శకంగా తయారవుతాయి. పిమ్మట కొంతకాలానికి అసలు పాముచేపలుగా మారి సంతానోత్పత్తి స్థితికి అర్హతపొందుతాయి. పాముచేపలు సాధారణంగా సముద్రజీవులు. కాని అప్పుడప్పుడు స్వచ్ఛజలాలలోకి వస్తూంటాయి.

 src=
Lifecycle of a typical (catadromous) eel

"లేడీ కాలిన్ క్యాంప్బెల్ 2" అనేది బాలిసోడేర్, ఐర్లాండ్లో ఉన్న పాముచేపల వర్ధకము.

ఉపజాతులు , కుటుంబాలు

  • ఉపజాతి:ప్రోటో-ఆంగ్వీలియిడే
    • కుటుంబం =ప్రోటో-ఆంగ్వీలోయిడే
  • ఉపజాతి: సైనాఫోబ్రాంఖోయిడే
    • కుటుంబం = సైనాఫోబ్రాంఖోయిడే (గొంతుకోత పాముచేపలు) [డైసోమ్మిడే, నెటొడారిడే, సైమెంఛెలిడేలతో కలిపి]
  • ఉపజాతి: మ్యూరేనోయిడే
    • కుటుంబం= హెటెరెంఛెలిడే (బురద పాముచేపలు)
    • కుటుంబం= మైరోఖాంగ్రిడే (సన్న పాముచేపలు)
    • కుటుంబం=మ్యూరేనిడే (మోరే పాముచేపలు)
  • ఉపజాతి: ఛ్లాప్సోయిడే
    • కుటుంబం= ఛ్లాప్సోయిడే (దొంగ మోరేలు)
  • ఉపజాతి: ఖాంగ్రిడే
    • కుటుంబం= ఖాంగ్రిడే (నల్లపాము చేపలు) [మ్యాక్రోసెఫెంఛెలిడే ; కోలోఖాంగ్రిడేలతో కలిపి]
    • కుటుంబం డెరిక్థిడే (పొడుగు మెడ పాముచేపలు) [నెస్సోర్ హ్యాంఫిడే]
    • కుటుంబం= మ్యూరేనెసోఖిడే (పైక్ నల్లపాము చేపలు)
    • కుటుంబం= నెటస్టొమాటిడే (బాతుముక్కు పాముచేపలు)
    • కుటుంబం= ఓఫిక్థిడే (పాము పాముచేపలు)
  • ఉపజాతి: మోరింగ్వీడే
    • కుటుంబం=మోరింగ్వీడే (స్ఫెగెట్టీ పాముచేపలు)
  • ఉపజాతి: స్యాకోఫారింగ్వీడే
    • కుటుంబం యూరీఫారింగ్వీడే (వంగిబాతు పాముచేపలు, మ్రింగుడు పాముచేపలు)
    • కుటుంబం స్యాకోఫారింగ్వీడే
    • కుటుంబం మోనోగ్నాతిడే (ఏకదవడ మ్రింగుడు పాముచేపలు)
    • కుటుంబం ఖైమాటిడే (గుర్రపుతోక గల పాముచేపలు
  • Suborder ఆంగ్వీల్లోయిడే
    • కుటుంబం ఆంగ్వీలియిడే (స్వచ్ఛజల పాముచేపలు)
    • కుటుంబం నెమిక్థిడే (కత్తెర పాముచేపలు)
    • కుటుంబం సెఱివోమెరిడే (ఱంపం వంటి పన్నులుగల పాముచేపలు)

దక్షిణామెరికాకు చెందిన తిమ్మిరిచేప ( ఎలక్ట్రిక్ ఈల్) నిజానికి పాముచేప కాదు, అది బొచ్చాడుమీను (కార్ప్), పెంకిజెల్ల చేప (క్యాట్ ఫిష్) కుటుంబాలకు చెందినది.

మనుషులకు ఉపయోగము

జపాను ఆహారంలో పాముచేపలు చాలా సామాన్యంగా తినబడతాయి. చీనాదేశంలో కూడా ఇవి ప్రసిద్ధి. ఐరోపా పాముచేపలు ఐరోపాదేశాలలో, అమెరికా ఐక్యరాష్ట్రాలలో ప్రసిద్ధి. ఉత్తర స్పెయిన్ వంటకమైన "అంగులాస్" అన బడేది యువ పాముచేపలను, ఆలివనూనె, వెల్లుల్లిఱెబ్బలు వేసిచేస్తారు, ఆ యువ పాముచేపలు కిలో వేయి యూరోల (సుమారు 85,000 రూ.) ధర పలుకుతాయి. న్యూజిలాండ్ సాంప్రదాయపు వంటల లో కూడా పాము చేపలను బాగా వాడుతారు. ఇటలీ వంటకాలలో ఆ దేశపు ఎడ్రియాటిక్ తీరంనుండి తెచ్చిన పాముచేపలు, బోల్సెనా తటాకపు జలాలలో పెరిగిన పాముచేపలు, క్యాబ్రాస్, సార్డినియా నుండి తెచ్చిన పాము చేపలు బాగా ఉపయీగిస్తారు. ఉత్తర జర్మనీ, నెదర్లాండ్స్, ౙక్ రిపబ్లిక్, పోలాండ్, డెన్మార్క్, స్వీడన్ దేశాలలో పొగబెట్టిన పాముచేప బాగా ప్రసిద్ధి.

యూ.కేలో ఒకప్పుడు ఎల్వర్లనబడే యువ పాముచేపల వేపుడు బాగా చౌకవంటకము కాని 1990ల సమయంలో పాము చేపల సంఖ్య ఆయా ప్రాంతాలలో తగ్గిపోగా, ప్రస్తుతం ఆ వంటకం చాలా అరుదుగా పండుగ సమయాలలో చేసుకొని తినడానికే పరిమితమైంది. ఆ వంటకం ధరకూడా పెరిగిపోయింది. ముఖ్యంగా మోరే పాముచేపలు, నీటిశాస్త్రవేత్తలకు బాగా ఆసక్తికరమైనవి. పాముచేపల రక్తం మనుషులకు, ఇతర క్షీరదాలకు హానికరము కాని వాటిని వండి తింటేమాత్రం ఏం ప్రమాదం లేదు. ఆ రక్తసారంలో ఉండే విషాన్ని మొట్టమొదటిగా "ఛార్ల్స్ రాబర్ట్ రిఛెట్" అనే వ్యక్తి కుక్కలపై ఆ రక్తాన్ని ప్రయోగించడం ద్వారా కనిపెట్టి నోబుల్ శాంతి బహుమతి పొందాడు. ఆ పరిశీలనలో అతడు ఆ రక్తంలోకి విషం అవి తినే సముద్రదోసల వలన వస్తుం దని నిర్ధారించాడు.

పాముచేపల చర్మం చాలా సున్నితంగానున్నప్పటికీ బహుదృఢంగా సాగే గుణం ఎక్కువ కలిగుంటుంది. కాని అన్ని పాముచేపల చర్మాన్ని తీయరు. పసిఫిక్ మహాసముద్రంలో ఉండి "హ్యాగ్ ఫిష్(ఆంగ్ల నామం)" అని పిలువబడే ఒక రకమైన బంక పాముచేప తోలు మాత్రమే తీసి కొన్నింటిలో వాడుతారు.

 src=
Eel picker in Maasholm, sculpture by Bernd Maro
 src=
Green water culture system for Japanese eel

చరిత్ర

మధ్యయుగ కాలంలో నెదర్లాండ్లోని "ఆల్మేర్ సరస్సు"కు ఆ పేరు అందులో ఎక్కువగా పాముచేపలుండటం వలన వచ్చింది. ఒళంద భాష(డచ్)లో ఈ పాము చేపను "ఆల్" లేదా "ఏల్" అని, సరస్సును "మేర్"అని అంటా రు. ఇప్పడు ఆ సరస్సు అక్కడ లేకపోయినా దాని స్మృతిగా ఆ ఊరి పేరును ఆల్మేర్ అని 1984లో మార్చారు.

పరాస దేశపు(ఫ్రెంచ్) పాలినీషియన్ దీవులలో ఒకటైన హువాహీన్లో 3-6 అడుగుల పొడవుగల పాము చేపలుగల ఒక సరస్సుంది. వాటిని ఆ స్థానికులు పవిత్రంగా భావిస్తారు.

స్థిరమైన వినియోగం

2010లో హరితశాంతి అంతర్రాష్టీయ సంస్థ, ఐరోపా-జపాను-అమెరికా పాముచేపలను సముద్రాహారపు ఎర్ర జాబితాలోకి చేర్చింది. జపాను ప్రపంచ వ్యాప్తంగా పట్టిన పాముచేపలలో డెబ్భైశాతం కన్నా ఎక్కువ తింటుంది.

ఉల్లేఖనాలు

  1. మూస:FishBase species
  2. "Anguilla rostrata". Integrated Taxonomic Information System. Retrieved May 2015. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)Check date values in: |accessdate= (help)
  3. Jacoby, D., Casselman, J., DeLucia, M., Hammerson, G.A. & Gollock, M. (2014). Anguilla rostrata. The IUCN Red List of Threatened Species. Version 2014.3
  4. మూస:FishBase species
  5. Anguilla anguilla (Linnaeus, 1758) FAO, Species Fact Sheet. Retrieved 20 May 2012.
  6. "Anguilla anguilla". Integrated Taxonomic Information System. Retrieved May 2012. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)Check date values in: |accessdate= (help)
  7. మూస:IUCN2011.2CS1 maint: Multiple names: authors list (link)
  8. మూస:FishBase species
  9. Anguilla japonica, Temminck & Schlegel, 1846 FAO, Species Fact Sheet. Retrieved May 2012.
  10. "Anguilla japonica". Integrated Taxonomic Information System. Retrieved May 2012. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)Check date values in: |accessdate= (help)
  11. Jacoby, D. & Gollock, M. (2014). "Anguilla japonica". The IUCN Red List of Threatened Species. IUCN. 2014: e.T166184A1117791. doi:10.2305/IUCN.UK.2014-1.RLTS.T166184A1117791.en. Retrieved 4 January 2018.
  12. మూస:FishBase species
  13. "Anguilla australis". Integrated Taxonomic Information System. Retrieved May 2012. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)Check date values in: |accessdate= (help)
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు