dcsimg

హమ్మింగ్ పక్షి ( télougou )

fourni par wikipedia emerging languages

హమ్మింగ్ పక్షి లేదా హమ్మింగ్ బర్డ్ ఒక రకమైన పక్షి. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పక్షిగా రికార్డులకెక్కింది.

ఎగురుతూనే తేనెను ఆస్వాదిస్తాయి.

  • వెనక్కి కూడా ఎగిరే సత్తా వీటికుంది. ఈ పక్షులు గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలవు.
  • ఇవి సెకనుకు 200 సార్లు రెక్కలాడించగలవు!
  • వీటిల్లో మగ పక్షుల ముక్కులు కాస్త పొడుగ్గా, వాడిగా ఉంటాయి. అవి వాటి పదునైన ముక్కునే కత్తుల్లా వాడుకుంటాయిట. అంటే శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ముక్కునే ఆయుధాల్లా ఉపయోగిస్తాయన్నమాట. న్యూ మెక్సికో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఇన్నాళ్లూ ఈ పక్షులు చురుకైన ముక్కుల ద్వారా పూల మకరందాన్ని మాత్రమే ఆస్వాదిస్తాయని అనుకున్నారు. కానీ ఇవి ముక్కుతో చేసే పనులు చూసి ఆశ్చర్యపోయారు.
  • ఇవి ఒకదానితో మరోటి గొంతుపై ముక్కుతో పొడుచుకుంటూ పోటీపడతాయి. తమ జతపక్షి ఇబ్బందుల్లో ఉంటే శత్రువుల్నించి కాపాడ్డానికి కూడా మగ హమ్మింగ్ పక్షులు ముక్కులతో ప్రత్యర్థుల గొంతుపై గట్టిగా పొడుస్తూ యుద్ధానికి దిగుతాయి.
  • కొస్టారికా ప్రాంతంలో శాస్త్రవేత్తలు నాలుగేళ్ల పాటు ఈ పరిశోధన చేశారు. అక్కడున్న వివిధ వయసు పక్షుల ముక్కుల పొడవు, చురుకుతనం లాంటివి తెలుసుకుని మరీ పరీక్షించారట. ఇలాంటి నైపుణ్యం అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్‌కు ఉండడంతో ఆశ్చర్యపోయారు.
  • ఇది వరకు జరిగిన పరిశోధనల్లో మగ హమ్మింగ్‌లు ఆడ పక్షుల్ని ఆకట్టుకోవడానికి గొంతును మార్చుతూ శబ్దాలు చేస్తాయనే సంగతి తెలిసింది.

చిత్రమాలిక

మూలాలు

బయటి లంకెలు

licence
cc-by-sa-3.0
droit d’auteur
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు