కొండ చిలువ (ఆంగ్లం Python) విషరహితమైన పెద్ద పాము. ఇవి పైథానిడే (Pythonidae) కుటుంబానికి చెందిన సరీసృపాలు.
ఇవి సాధారణంగా సహారా ఎడారికి దక్షిణాన, ఆఫ్రికాలోని ఉష్ణప్రాంతాలలో లేదా మడగాస్కర్ ప్రాంతాలలో కనిపిస్తుంది. కానీ దక్షిణాఫ్రికాలో మాత్రం కనిపించదు. ఆసియా దేశాలైన పాకిస్థాన్, భారతదేశం, శ్రీలంక,, నికోబార్ దీవులు, మయన్మార్, చైనా దక్షిణ ప్రాంతం, హాంకాంగ్, ఇండోనేషియా లేదా ఫిలిప్ఫైన్స్ లోని మలయా ప్రాంతాల్లో కనిపిస్తుంది.
ఎక్కువగా అడవుల్లో నివసిస్తూ జంతువులను మింగి వాటి ఆకలిని తీర్చుకుంటాయి. కొన్ని సార్లు మనుష్యులను కూడా ఇవి మింగిన సందర్భాలున్నాయి.