ఊటి చెట్టు ఒక చిన్న చెట్టు. దీని శాస్త్రీయనామం Diospyros geminata. ఇది సుమారు పది అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇది అడవులలో, కొండలలో పెరుగుతుంది. మూలికా వైద్యంలో కొన్ని రకాల గాయాలకు ఊటి ఆకు దంచి పూస్తారు. ఊటి చెట్టు చెట్టు కాయలను తినవచ్చు. దీని కాయలు పచ్చివి ఆకుపచ్చ రంగులోను, దోర కాయలు పసుపు రంగులోను, బాగా మాగిన పండ్లు ఎరుపు రంగులోను ఉంటాయి. బాగా మాగిన పండ్లు తియ్యగా ఉంటాయి. దీని కర్ర బాగా గట్టిగా ఉంటుంది అందువలన ఈ కర్రను పిడికి ఉపయోగిస్తారు.