dcsimg
Image of sessile joyweed
Creatures » » Plants » » Dicotyledons » » Amaranth Family »

Sessile Joyweed

Alternanthera sessilis (L.) DC.

పొన్నగంటి కూర ( Telugu )

provided by wikipedia emerging languages

పొన్నగంటి కూర (Alternanthera sessilis) అమరాంథేసి కుటుంబానికి చెందిన ఒక ఆకుకూర.ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ 'ఎ', 'బి6', 'సి', ఫొలేట్, 'రైబోఫ్లెవిన్', పొటాషియం, ఇనుము, మెగ్నీషియం దీన్నుంచి సమృద్ధిగా దొరకుతాయి. గోధుమ పిండి, బియ్యం, ఓట్స్‌లో కంటే ముప్ఫై శాతం ఎక్కువగా ప్రొటీన్లు అందుతాయి. అమినో ఆమ్లాలూ శరీరానికి లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీన్లో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గౌట్, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. ఒకసారి కూర చేశాక పదే పదే వేడి చేయడం సరికాదు. ఒక్కోసారి వికారానికి దారి తీసే ప్రమాదం ఉంది.

ఇతర భాషలలో పేర్లు

సంస్కృతం : మత్యాక్షి, పత్తూర్, హిందీ : గుద్రిసాగ్, కన్నడ : వోనుగొనె సొప్పు, మలయాళం : మీనన్నాని, పొన్నన్నాని, తమిళం : పొన్నన్కన్నిక్కిరై

వ్యాప్తి

భారతదేశమంతటా తేమగల ప్రదేశాలలో పెరుగుతుంది. పెంచబడుతుంది.

మొక్క వర్ణన

శాఖోపశాఖలుగా నేలపై పాకే ఔషధీ మొక్క. శాఖ కాండలు సాధారణంగా ఊదా రంగులో ఉంటాయి. క్రింది కణుపుల నుండి నేలలోకి వేళ్ళు పాతుకుంటాయి. ఆకులు కొద్ది మందంగా చిన్నవిగా కొలగా కొసగా చిన్న చిన్న బిళ్ళలు వలె ఉంటాయి. ఆకు కాడలు కొద్ది బారుగా వెడల్పుగానే ఉంటాయి. మొక్క పై నూగు లేకుండా నున్నగా ఉంటుంది. పూవులు చిన్నవిగా, తెల్ల రేఖలు ముద్దగా ఉంటాయి. కాయలు పల్చగా ఉంటాయి.

ఉపయోగపడే భాగాలు

మొక్క అన్ని భాగాలు.

ఔషధ ఉపయోగాలు

రుచి కొద్ది కటువుగా తియ్యగా ఉంటాయి. వగరుగా ఉండి మలబద్దకము కలిగిస్తుంది. రక్తశుద్ధి, జీర్ణశక్తిని పెంపొందించుతుంది. పైత్యమును పెంచుతుంది. క్షీర వర్థని, జ్వరమును తగ్గిస్తుంది. కఫ, పిత్త దోషాలను తగ్గిస్తుంది. శరీరము మంటలు, అతిసారము, కుష్ఠు, చర్మవ్యాధులు, రక్తస్రావము, అజీర్ణము, ప్లీహ సంబంధమైన వ్యాధులకు, జ్వరాలకు పనిచేస్తుంది.

 src=
పొన్నగంటికూర ఆకు/ వెంకట్రామాపురంలో తీసిన చిత్రము

లక్షణాలు

  • కణుపుల వద్ద అబ్బురపు వేళ్ళతో నీలి ఎరుపు రంగుతో కూడిన సాగిలపడి లేదా ఉద్వక్ర నిర్మాణంలో ఉన్న శాఖలతో పెరిగే ఏకవార్షిక గుల్మం.
  • సన్నగా, దీర్ఘవృత్తాకారంలో గాని, దీర్ధభల్లాకారంలో గాని అమరివున్న సరళ పత్రాలు.
  • గ్రీవాలలో ఏర్పడిన శీర్షవద్విన్యాసాలలో అమరివున్న తెలుపు రంగు పుష్పాలు.
  • తెలుపు లేదా కెంపు రంగులో ఉన్న పిక్సీడియం విదారక ఫలం.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

పొన్నగంటి కూర: Brief Summary ( Telugu )