dcsimg

గరుడ ముక్కు ( Telugu )

provided by wikipedia emerging languages

గరుడ ముక్కు అనగా ఒక ఔషధ మొక్క. దీని విత్తనాలు గ్రద్ధ ముక్కు ఆకారంలో, కాండం రెండు చేతులు కలిసినట్లుగా ఉంటుంది. ఈ మొక్క శాస్త్రీయ నామం మార్టీనియా ఆన్యువా (Martynia Annua). దక్షిణ భారతదేశంలో ఉన్న ఎజెన్సీ నేలల్లో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. పంజాబీ, హిందీ భాషల్లో ఈ మొక్కను హతజోరి లేక హతజోడి అని అంటారు. సంస్కృతంలో ఈ మొక్కను కాకంగి, కకనస అనే పేర్లతో పిలుస్తారు.

ఉపయోగాలు

 src=
కొక్కెం కలిగిన గరుడ ముక్కు పండ్లు.
 src=
Martynia annua

మొక్క ఆకుల రసం మూర్ఛ వ్యాధికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆకుల రసం నిద్రలేమికి, క్షయ, బొంగురు గొంతుకు, విషపురుగుల కాటుకు, గండమాలకు ఉపయోగపడుతుంది [1] [2] [3] 2. విత్తనాల నుంచి తీసిన నూనెను తెల్లజుట్టుకు, దురదలకు, చర్మవ్యాధులకు వాడవచ్చును.

ఇతర విషయాలు

మధ్యప్రదేశ్ ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఈ మొక్క కాండాన్ని తాంత్రిక, వశీకరణ చర్యలకు వాడుదురు.

 src=
గద్దముక్కు చెట్టు. నాగార్జున సాగర్ వద్ద తీసిన చిత్రము

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం (PDF) నుండి 2012-10-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2012-08-08. Cite web requires |website= (help)
  2. Phytochemical and Pharmacognostical studies of Martynia Annua plant - by Katare Vivekanand, Pathak A.K, Kori M.L, Chakraborty Bodhisattwa, Nandy Subhangkar
  3. ournal of Pharmacognosy and Phytochemistry - Vol. 1 No.6 2013, www.phytojournal.com, Page |135, Martynia annua, L.: A Review on Its Ethnobotany, Phytochemical and Pharmacological Profile, Ashwani K Dhingra, Bhawna Chopra, Sanjeev K Mittal

లంకెలు

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు