భూచక్రగడ్డ (ఆంగ్లం: Maerua oblongifolia (syn. Maerua arenaria, Niebhuria arenaria)) అనునది ఔషధ మొక్క. దీనిని భూచక్ర దుంప అని కూడా అంటారు. ఇది తక్కువ ఎత్తు పెరిగే మొక్క.కొన్ని సందర్బాలలో 2 నుండి 3 మీటర్లు ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు దీర్ఘచతురస్రాండాకారంలో 2 నుంచి 4.5 సెంటీమీటర్ల పొడవు, 0.7 నుంచి 2.5 సెంటీమీటర్ల వెడల్పుతో ఉంటాయి. దీని పుష్పం తెల్లగా లేత ఆకుపచ్చని కేశరములను కలిగి అందంగా ఉంటుంది. దీని రక్షక పత్రాలు దీర్ఘవృత్తాండాకారంలో కొద్దిగా మొనదేలినవి నాలుగు ఉంటాయి. దీని పండు స్థూపాకారంగా 3 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు, 1 నుంచి 1.5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది, అప్పుడప్పుడు దీని కాయలు ముడులు పడినట్లుగా, మెలికలు తిరిగినట్లుగా లేత గోధుమ రంగులో ఉంటాయి. ఇది స్థూపాకార మందమైన కాండము, దళసరి ఆకులు,బాగా సువాసన గల పూలు కలిగి ఉండును.దీని వేరు అర అడుగు నుంచి అడుగు ఆడ్డుకొలత వ్యాసంతో మూడు నుంచి ఆరు అడుగుల పొడవు ఉంటుంది. స్థూపాకారంలో ఉండే ఈ గడ్డను అడవి ప్రాంతాల నుంచి స్వీకరించి పలుచని పొరలుగా ఈ గడ్డను కోస్తూ అమ్ముతుంటారు. ఈ గడ్డ రుచిగా, తీయగా ఉండేందుకు ఈ గడ్డ పలుచని పొరలకు చక్కెర నీటిని అద్దుతారు. ఇది ఇండియా, పాకిస్తాన్,ఆఫ్రికా, సౌదీ అరేబియాలో ఉంటుంది. దీని వేరు భాగము కొబ్బరి కంజె లాగ రుచికరంగా ఉండును. ఇది పంచదారతో కలిపి తింటారు. గిరిజన ప్రాంతాల ప్రజలు దీనిని ఎక్కువగా పండిస్తారు.ఇది వేసవి కాలంలో దాహం వెంటనే నివారించుటకు తీసుకుంటారు.
భూచక్రగడ్డ సేకరణ చుట్టూ అనేక నమ్మకాలు, ఆచారాలు ముడిపెట్టుకునివున్నాయి. భూచక్రగడ్డను చెంచులు అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. ఒక గడ్డ దొరికితే కుటుంబమంతా కనీసం నెలరోజులు బతికే ఆదాయాన్నిస్తుంది కాబట్టి దీనిని లక్ష్మిగడ్డ అని, లచ్చిగడ్డ అని కూడా పిలుస్తుంటారు. చెంచు తండాల్లో దీన్ని లచ్చిగడ్డ అని మాత్రమే పిలుస్తారు. నరసింహస్వామిని ఆరాధించే చెంచులు భూచక్రగడ్డను నరసింహస్వామి ప్రసాదంగా కూడా భావిస్తుంటారు. ఉత్సవాల సమయంలో అమ్మేటప్పుడు దీనిని గడ్డప్రసాదమని చెప్తుంటారు.
భూచక్రగడ్డ ... మీటరు నుంచి 20 మీటర్ల పొడవు దాకా భూమిలో పది, పన్నెండు అడుగుల లోతున పెరుగుతుంది. భూచక్రగడ్డ దొరికే అవకాశం వుండే ప్రాంతాల్లో ఒకవిధమైన మత్తులాంటి వాసన వస్తుందట. చెంచులు ఆ వాసనను పసిగట్టే, గడ్డ కోసం శోధన మొదలుపెడతారట. గడ్డ ఒకచోట దొరుకుతుందని రూఢిగా తెలిశాక, సంప్రదాయబద్ధంగా పూజలు చేసిన తర్వాత తవ్వడం మొదలుపెడతారు. దొరికిన గడ్డను ఆ పనిలో భాగం పంచుకున్నవాళ్ళందరూ సమానంగా పంచుకుంటారు. గడ్డ మొదలు, చివర్లలో అడుగు మోయిన కత్తిరించి, ఎక్కడో ఒకచోట తిరిగి భూమిలో పాతుతారు. ఇది మొలకెత్తదు. కానీ వారి ఆచారంలో భాగంగా అలా చేస్తారు.