dcsimg

భూచక్రగడ్డ ( télougou )

fourni par wikipedia emerging languages

 src=
సహజ సిద్ధంగా అడవులలో చాలా అరుదుగా లభించే భూచక్రదుంప

భూచక్రగడ్డ (ఆంగ్లం: Maerua oblongifolia (syn. Maerua arenaria, Niebhuria arenaria)) అనునది ఔషధ మొక్క. దీనిని భూచక్ర దుంప అని కూడా అంటారు. ఇది తక్కువ ఎత్తు పెరిగే మొక్క.కొన్ని సందర్బాలలో 2 నుండి 3 మీటర్లు ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు దీర్ఘచతురస్రాండాకారంలో 2 నుంచి 4.5 సెంటీమీటర్ల పొడవు, 0.7 నుంచి 2.5 సెంటీమీటర్ల వెడల్పుతో ఉంటాయి. దీని పుష్పం తెల్లగా లేత ఆకుపచ్చని కేశరములను కలిగి అందంగా ఉంటుంది. దీని రక్షక పత్రాలు దీర్ఘవృత్తాండాకారంలో కొద్దిగా మొనదేలినవి నాలుగు ఉంటాయి. దీని పండు స్థూపాకారంగా 3 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు, 1 నుంచి 1.5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది, అప్పుడప్పుడు దీని కాయలు ముడులు పడినట్లుగా, మెలికలు తిరిగినట్లుగా లేత గోధుమ రంగులో ఉంటాయి. ఇది స్థూపాకార మందమైన కాండము, దళసరి ఆకులు,బాగా సువాసన గల పూలు కలిగి ఉండును.దీని వేరు అర అడుగు నుంచి అడుగు ఆడ్డుకొలత వ్యాసంతో మూడు నుంచి ఆరు అడుగుల పొడవు ఉంటుంది. స్థూపాకారంలో ఉండే ఈ గడ్డను అడవి ప్రాంతాల నుంచి స్వీకరించి పలుచని పొరలుగా ఈ గడ్డను కోస్తూ అమ్ముతుంటారు. ఈ గడ్డ రుచిగా, తీయగా ఉండేందుకు ఈ గడ్డ పలుచని పొరలకు చక్కెర నీటిని అద్దుతారు. ఇది ఇండియా, పాకిస్తాన్,ఆఫ్రికా, సౌదీ అరేబియాలో ఉంటుంది. దీని వేరు భాగము కొబ్బరి కంజె లాగ రుచికరంగా ఉండును. ఇది పంచదారతో కలిపి తింటారు. గిరిజన ప్రాంతాల ప్రజలు దీనిని ఎక్కువగా పండిస్తారు.ఇది వేసవి కాలంలో దాహం వెంటనే నివారించుటకు తీసుకుంటారు.

నమ్మకాలు

భూచ‌క్ర‌గ‌డ్డ సేక‌రణ చుట్టూ అనేక న‌మ్మ‌కాలు, ఆచారాలు ముడిపెట్టుకునివున్నాయి. భూచ‌క్ర‌గ‌డ్డను చెంచులు అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. ఒక గ‌డ్డ దొరికితే కుటుంబ‌మంతా క‌నీసం నెల‌రోజులు బ‌తికే ఆదాయాన్నిస్తుంది కాబ‌ట్టి దీనిని ల‌క్ష్మిగ‌డ్డ అని, ల‌చ్చిగ‌డ్డ అని కూడా పిలుస్తుంటారు. చెంచు తండాల్లో దీన్ని ల‌చ్చిగ‌డ్డ అని మాత్ర‌మే పిలుస్తారు. న‌ర‌సింహ‌స్వామిని ఆరాధించే చెంచులు భూచ‌క్ర‌గ‌డ్డ‌ను న‌ర‌సింహ‌స్వామి ప్ర‌సాదంగా కూడా భావిస్తుంటారు. ఉత్స‌వాల స‌మ‌యంలో అమ్మేట‌ప్పుడు దీనిని గ‌డ్డ‌ప్ర‌సాద‌మ‌ని చెప్తుంటారు.

ఎక్కడ దొరుకుతుంది

భూచ‌క్ర‌గ‌డ్డ ... మీట‌రు నుంచి 20 మీట‌ర్ల పొడ‌వు దాకా భూమిలో ప‌ది, ప‌న్నెండు అడుగుల లోతున పెరుగుతుంది. భూచ‌క్ర‌గ‌డ్డ దొరికే అవ‌కాశం వుండే ప్రాంతాల్లో ఒక‌విధ‌మైన మ‌త్తులాంటి వాస‌న వ‌స్తుంద‌ట‌. చెంచులు ఆ వాస‌న‌ను ప‌సిగ‌ట్టే, గ‌డ్డ కోసం శోధ‌న మొద‌లుపెడ‌తార‌ట‌. గ‌డ్డ ఒక‌చోట దొరుకుతుంద‌ని రూఢిగా తెలిశాక‌, సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పూజ‌లు చేసిన త‌ర్వాత త‌వ్వ‌డం మొద‌లుపెడ‌తారు. దొరికిన గ‌డ్డ‌ను ఆ ప‌నిలో భాగం పంచుకున్న‌వాళ్ళంద‌రూ స‌మానంగా పంచుకుంటారు. గ‌డ్డ మొద‌లు, చివ‌ర్ల‌లో అడుగు మోయిన క‌త్తిరించి, ఎక్క‌డో ఒక‌చోట తిరిగి భూమిలో పాతుతారు. ఇది మొల‌కెత్త‌దు. కానీ వారి ఆచారంలో భాగంగా అలా చేస్తారు.

ఉపయోగాలు

  • ర‌క్త‌విరోచ‌నాలు,
  • క‌డుపులోప‌ల ప‌డే పుండ్ల‌ను మాన్పుతుంది.
  • ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రిస్తుంది.
  • తాజాగా తీసిన ముక్క‌ను చాలా కొద్దిగా పాలు, తేనెతో క‌లిపి మిక్సీలో వేస్తే వ‌చ్చే పాలను గడ్డపాలు అంటారు.
  • పాలు ఇవ్వ‌లేని త‌ల్లులు ఈ 'గ‌డ్డ‌పాలు' పసిపిల్లలకు పడతారు
  • దాహాన్ని నివారించుటకు
  • పాము,తేలు కాటు వేసినపుడు గిరిజన వైద్యంలో [1]
 src=
అమ్మకానికి ఉంచిన భూచక్రగడ్డ

సూచిక

  1. K.R.Kirthikar, P.D Basu, "Indian Medicinal Plants", The Indian Press, Allahabad, p 101, (1918)

ఇవి కూడా చూడండి

licence
cc-by-sa-3.0
droit d’auteur
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

భూచక్రగడ్డ: Brief Summary ( télougou )

fourni par wikipedia emerging languages
 src= సహజ సిద్ధంగా అడవులలో చాలా అరుదుగా లభించే భూచక్రదుంప

భూచక్రగడ్డ (ఆంగ్లం: Maerua oblongifolia (syn. Maerua arenaria, Niebhuria arenaria)) అనునది ఔషధ మొక్క. దీనిని భూచక్ర దుంప అని కూడా అంటారు. ఇది తక్కువ ఎత్తు పెరిగే మొక్క.కొన్ని సందర్బాలలో 2 నుండి 3 మీటర్లు ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు దీర్ఘచతురస్రాండాకారంలో 2 నుంచి 4.5 సెంటీమీటర్ల పొడవు, 0.7 నుంచి 2.5 సెంటీమీటర్ల వెడల్పుతో ఉంటాయి. దీని పుష్పం తెల్లగా లేత ఆకుపచ్చని కేశరములను కలిగి అందంగా ఉంటుంది. దీని రక్షక పత్రాలు దీర్ఘవృత్తాండాకారంలో కొద్దిగా మొనదేలినవి నాలుగు ఉంటాయి. దీని పండు స్థూపాకారంగా 3 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు, 1 నుంచి 1.5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది, అప్పుడప్పుడు దీని కాయలు ముడులు పడినట్లుగా, మెలికలు తిరిగినట్లుగా లేత గోధుమ రంగులో ఉంటాయి. ఇది స్థూపాకార మందమైన కాండము, దళసరి ఆకులు,బాగా సువాసన గల పూలు కలిగి ఉండును.దీని వేరు అర అడుగు నుంచి అడుగు ఆడ్డుకొలత వ్యాసంతో మూడు నుంచి ఆరు అడుగుల పొడవు ఉంటుంది. స్థూపాకారంలో ఉండే ఈ గడ్డను అడవి ప్రాంతాల నుంచి స్వీకరించి పలుచని పొరలుగా ఈ గడ్డను కోస్తూ అమ్ముతుంటారు. ఈ గడ్డ రుచిగా, తీయగా ఉండేందుకు ఈ గడ్డ పలుచని పొరలకు చక్కెర నీటిని అద్దుతారు. ఇది ఇండియా, పాకిస్తాన్,ఆఫ్రికా, సౌదీ అరేబియాలో ఉంటుంది. దీని వేరు భాగము కొబ్బరి కంజె లాగ రుచికరంగా ఉండును. ఇది పంచదారతో కలిపి తింటారు. గిరిజన ప్రాంతాల ప్రజలు దీనిని ఎక్కువగా పండిస్తారు.ఇది వేసవి కాలంలో దాహం వెంటనే నివారించుటకు తీసుకుంటారు.

licence
cc-by-sa-3.0
droit d’auteur
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

Maerua oblongifolia ( anglais )

fourni par wikipedia EN

A Maerua oblongifolia being sold at the thindi beedi (food street), V.V. Puram, Bangalore

Maerua oblongifolia (syn. Maerua arenaria, Niebhuria arenaria) is a low woody bushy under-shrub sometimes scandent to 2–3 meters high, with a thick root stock and thick leaves, and strongly scented flowers, occurring in India, Pakistan, Africa and Saudi Arabia. In Telugu this plant is known as Bhoochakra gadda (In Telangana) and also as Bhoochakra dumpa (In Andhra). In Tamil this plant is called Poomicchakkarai Kizhangu (பூமிச் சர்க்கரைக் கிழங்கு). This is a tuber that naturally grows in areas closer to fountains, especially in hills. Local Tribes and others collect the tubers, which are then sold in many Indian town and cities as a quick street food.

Selling Bhoochakra gadda root small round pieces

Uses

The root of the plant resembles licorice in appearance and taste and said to possess alternative, tonic and medicinal properties.[1] The root of this plant, which tastes like coconut pulp, is edible and is eaten with sugar. The tuber is medicinal, and is used in Indian traditional medicine such as Siddha medicine, and is also eaten raw to quench thirst. Traditionally, the fleshy roots of this plant are used as alternative tonic and stimulant. The plant is also used for treatment of snake bites and scorpion stings.[2]

Doubts

The root is brought to the shops in a very secretive manner, in that where it is either collected or obtained is kept secret. There are doubts amongst botanists as to whether the described plant is Maerua oblongifolia.[3]

References

  1. ^ Encyclopaedia of world medicinal plants, Volume 1 - By T. Pullaiah
  2. ^ K.R.Kirthikar, P.D Basu, "Indian Medicinal Plants", The Indian Press, Allahabad, p. 101, (1918)
  3. ^ "The Mysterious Street Snack That Has Baffled Botanists for Decades". 5 August 2021.

licence
cc-by-sa-3.0
droit d’auteur
Wikipedia authors and editors
original
visiter la source
site partenaire
wikipedia EN

Maerua oblongifolia: Brief Summary ( anglais )