dcsimg

ఊదా పొట్ట లోరీ ( télougou )

fourni par wikipedia emerging languages

  • ఊదా పొట్ట లోరీ (-లోరియస్ హైపోయినోక్రౌస్-) అనేది ప్సిట్టాసిడాయె కుటుంబములోని ఒక జాతి చిలుక. ఇది పపువా న్యూగినియాకు చెందినది.

దీని సహజ నివాస స్థలాలు ఉష్ణ, సమశీతోష్ణ లోతట్టు చిత్తడి అడవులు, ఉష్ణ, సమశీతోష్ణ మడ అడవులు, ఉష్ణ ,సమశీతోష్ణ ఎత్తైన వర్షారణ్యాలు.

వివరణ

  • ఊదా పొట్ట లోరీ 26 సెం.మీ(10 ఇంచులు) పొడవు గలది.తలపై ఎరుపు, నలుపు రంగులు కలిసి ఉంటాయి. ఆకుపచ్చని రెక్కలు,అడుగుభాగం ఊదా రంగులో ఉంటుంది. తొడలు ఊదా రంగులోనూ, కాళ్ళు బూడిద రంగులోనూ ఉంటాయి. తోక ఎరుపుగా ఉండి చివర ముదురు ఆకుపచ్చ, నీలం రంగులు ఉంటాయి.ముక్కు పైభాగం తెల్లగా ఉంటుంది.కంటి చుట్టూ వలయాలు బూడిద రంగులోనూ, కంటిపాపలు నారింజ ఎరుపు రంగులో ఉంటాయి. వీటిలోని మూడు ఉప జాతులు ఈకల రంగులలో చిన్ని తేడాలతో ఉంటాయి..[1]

శాస్త్రీయ విశ్లేషణ

ఈ ప్రజాతి (-లోరియస్ హైపోయినోక్రౌస్-) ఇంకా మూడు ఉప జాతులను కలిగి ఉంది.:[2]

లోరియస్ హైపోయినోక్రౌస్ Gray, GR 1859

  • 'లోరియస్ హైపోయినోక్రౌస్ దెవిట్టాటస్ Hartert 1898
  • 'లోరియస్ హైపోయినోక్రౌస్ హైపోయినోక్రౌస్ Gray, GR 1859
  • లోరియస్ హైపోయినోక్రౌస్ రోస్సెలియానస్ Rothschild & Hartert 1918

licence
cc-by-sa-3.0
droit d’auteur
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు