ఫోన్పై లోరికీట్(-ట్రైకోగ్లోస్సస్ రుబిజినోసస్ అనేది ప్సిట్టాసిడయే కుటుంబములోని ఒక చిలుక ప్రజాతి. ఇది మైక్రోనేసియా లోని ఫోన్పై, దగ్గర్లోని అహిన్ద్ అటోల్ దీవులకు పరిమితమైనది. చరిత్ర పరంగా ఇది ఛుక్ దగ్గరలోని నమోలుక్ దీవిలో కూడా ఉండేది. ఒకానొకప్పుడు ఇది మైక్రోనేసియా అంతటా ఉండేవి. .[1]
ఈ పక్షి 24 సెం.మీ పొడవు కలిగి ఉండి 80 గ్రాముల బరువు ఉంటుంది. ఈ పక్షి ఈకలు ప్రధానంగా ఎరుపు-మెరూన్ రంగుతో ఉండి అస్పష్టంగా విలోమ రంగులతో గాఢ మెరూన్ రంగును కలిగి ఉంటాయి. దీని తల భాగమంతా గాఢ మెరూన్ రంగును కలిగి ఉంటుంది. ఎగిరే ఈకలు, తోక ఆలివ్ పసుపు రంగును కలిగి ఉంటాయి. కాళ్ళు బూడిద రంగుతో ఉంటాయి. మగ పక్షికి ఆరెంజ్ ముక్కు, పసుపు-ఆరెంజ్ కనుపాప ఉంటుంది. ఆడ పక్షికి పసుపు ముక్కు, బూడిద రంగులో కనుపాప ఉంటుంది. పిల్ల పక్షులు బూడిద రంగు ముక్కు, బూడిద రంగు కనుపాప కలిగి ఉంటాయి[2].
దీని సహజ ఆవాసాలు ఉష్ణమండల తేమ లోతట్టు అడవులు, తోటలు. వీటి ఆహారం కొబ్బరిచెట్ల నుండి వచ్చే పూతేనె, పుప్పొడితో కూడి ఉంటుంది. ఇవి పండ్లను, కీటకాల లార్వాలను కూడా ఆహారంగా తీసుకుంటాయి. ఇది ఒక చెట్టులోని రంధ్రంలో గూడు కట్టుకుని, ఒకే గుడ్డు పెడుతుంది. ఈ జాతులు సాధారణమైనవి. కానీ బెదిరింపు చేసే పక్షులుగా పరిగణించబడవు.