అనోనేసి (Annonaceae) కుటుంబంలో దాదాపు 80 ప్రజాతులకు చెందిన 820 జాతుల మొక్కలు ఉన్నాయి. దీనికి ఈ పేరు అనోనా (Annona) ప్రజాతి మూలంగా వచ్చినది. ఇవి ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాలలో వ్యాప్తిచెంది ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 129 జాతులను గుర్తించారు.
కుటుంబ లక్షణాలు
- వృక్షాలు లేదా పొదలు, కొన్ని ఎగబ్రాకే పొదలు, కలప గ్రంధి భరితం.
- లఘుపత్రాలు, ఏకాంతరము, పుచ్ఛరహితము.
- ఒంటరి పుష్పాలు, త్రిభాగయుతము, అర్థచక్రీయము.
- పొడవైన, శంఖువంటి పుష్పాసనము.
- కేసరములు, ఫలదళములు అనేకము, అసంయుక్తము, సర్పిలాకారంగా అమరి ఉంటాయి.
- సంకలితఫలము, చిరుఫలము, మృదుఫలము.
- రూమినేట్ అంకురచ్ఛదము.
ముఖ్యమైన మొక్కలు
మూలాలు
- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.